భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ పడటంతో కేటీఆర్ కు గాయాలయ్యాయి.. దీంతో వైద్యులు ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.. కె.టి.ఆర్ గారికి గాయం జరిగిన సంగతి తెలుసుకొని బాధ పడ్డాను. వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.




