‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్ తన రెండవ సినిమాగా ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తెలుగులో ప్రతి సినిమా ముందు మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వచ్చే యాడ్‌లో ఈ నగరానికి ఏమైంది అంటూ డైలాగ్ వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఆ డైలాగ్ ఫేమస్ అయ్యింది. అందుకే విభిన్నంగా, అందరికి నచ్చేలా, మెచ్చేలా ఈ టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ చిత్రం ఆడియో విడుదలకు సురేష్‌బాబు ఫ్యామిలీ అంతా కదిలి వచ్చింది. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యారు.
‘పెళ్లి చూపులు’ చిత్రంను ప్రత్యేక షో ద్వారా చూసిన కేటీఆర్ అప్పట్లో సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. కేటీఆర్ ప్రశంసల తర్వాత సినిమా గురించి ఎక్కువ శాతం ప్రేక్షకులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పెళ్లి చూపులు చిత్రాన్ని కేటీఆర్ చాలా ప్రశంసించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా ‘ఈనగరానికి ఏమైంది’ చిత్రం కూడా తప్పకుండా బాగుంటుందనే అభిప్రాయంను కేటీఆర్ వ్యక్తం చేశారు.
అంతా కొత్త వారితో సినిమా చేయడం అనేది పెద్ద సాహసం. స్టార్స్ లేకుంటే సినిమాలను ప్రేక్షకులు చూడటం లేదు. అయినా కూడా తన కథే స్టార్ అని నమ్మిన దర్శకుడు తరుణ్ భాస్కర్ అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని చేయడం జరిగింది. టీజర్ మరియు ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా ఖచ్చితంగా బాగుంటుందని కేటీఆర్‌తో పాటు సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. సురేష్‌బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.