ముందస్తు ఎన్నికలతో తెలంగాణ రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. ముందు ఈ ఆరోపణల పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా ఇప్పుడు దానిని కాంగ్రెస్ నేతలు, కేటీఆర్ కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు కేటీఆర్ రామారావు అమెరికాలో అంట్లు తోముకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించగా తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.
’నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. మీ మాదిరిగా ప్రజల డబ్బును లూటీ చేసి కారులో డబ్బులను తగులబెట్టుకోలేదని ఆయన ఉత్తమ్‌కు చురకలింటించారు. 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.