ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. కరీంనగర్ గడ్డ.. గులాబీ పార్టీ అడ్డా అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది కరీంనగరేనన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారాయన. కార్యకర్తలను వేధించేవారి భరతం పడతామన్నారు కేటీఆర్. కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టిన పోలీసులు రిటైర్ అయినా.. విదేశాల్లో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.