జగన్ కి అండగా వై.ఎస్ కోటరీ… సబ్బం షరతు?

KVP and Undavalli want to do help to YS jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు వై.ఎస్ కి అండదండగా నిలిచిన కేవీపీ, ఉండవల్లి లాంటి నేతలు ఇప్పుడు కష్ట కాలంలో వున్న తమ స్నేహితుడి కొడుకు జగన్ కి అండగా నిలవాలని ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రత్యక్షంగా వైసీపీలో చేరినా, చేరకపోయినా జగన్ కి మేలు జరిగేలా తమ అడుగులు పడేలా చూసుకోవాలని ఇటీవల జరిగిన ఓ ఆంతరంగిక సమావేశంలో దాదాపు ఒట్టు వేసుకున్నంత పని చేశారట. ఈ సమావేశంలోనే వై.ఎస్ కి దగ్గరగా ఉండి జగన్ కి దూరమైన వారిని ఒక్కతాటి మీదకు తెచ్చే పనిని ఉండవల్లికి అప్పజెప్పారట కేవీపీ. తన రాజకీయ గురువుగా చెప్పుకునే కేవీపీ మాటని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండవల్లి ఇప్పటికే రంగంలోకి దిగి పని చేసుకుంటూ పోతున్నారట.

జగన్ కి మద్దతుగా రాజకీయ సమీకరణ చేస్తున్న ఉండవల్లి ప్రతిపాదనకు ఎక్కువ మంది నేతలు సానుకూలంగా స్పందించినప్పటికీ ఒక్కరి నుంచి ఊహించని సమాధానం ఎదురైందట. ఆ ఒక్కరే మాజీ ఎంపీ సబ్బం హరి. భార్యా వియోగం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సబ్బం హరి ఇకపై రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని భావిస్తున్నారట. అది తెలుసుకునే పాత మిత్రుడు ఉండవల్లి ఆయన్ని కదిలించాడట. జగన్ కి అండగా నిలుద్దామని ప్రతిపాదించాడట. అయితే ఒకప్పుడు అందరికన్నా ముందు జగన్ ని బలపరిచి కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి గురైన సబ్బం హరి ఆ తర్వాత జగన్ కి దూరమయ్యారు. ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, అసలుకే జగన్ ప్రవర్తన బాగా లేదని బహిరంగంగానే చెప్పాడు సబ్బం హరి. ఇప్పుడు ఉండవల్లికి కూడా నాటి విషయాలు మొత్తం చెప్పి ఓ షరతు ముందు ఉంచాడట. ఒకవేళ జగన్ స్వయంగా ఫోన్ చేసి పాత విషయాలన్నీ మర్చిపోయి కలిసి పని చేద్దామని అడిగితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పాడట. సబ్బం షరతుకి ఉండవల్లి చూద్దామని చెప్పినా జగన్ అంత తగ్గి వస్తాడా అన్నది డౌటే.

మరిన్ని వార్తలు 

నంద్యాల ఉపఎన్నిక ఓ మామ, ఓ తమ్ముడికి అగ్నిపరీక్ష.