పైకి శాంతి.. లోపల యుద్ధం

ladak-issue-increasing-war-conditions-between-india-and-china

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డ్రాగన్ తన కుటిల బుద్ధిని మళ్లీ మళ్లీ బయటపెడుతూనే ఉంది. గతంలో అలీన ఒప్పందాన్ని గౌరవిస్తామని, హిందీ – చీనీ భాయీ భాయీ అని చెబుతూనే 1962లో యుద్ధానికి దిగిన చైనా.. ఇప్పుడు మళ్లీ అదే స్ట్రాటజీ అవలంబిస్తోంది. భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. యుద్ధానికి రక్తాన్ని కూడా సేకరిస్తోంది. దీంతో చైనా చర్యలపై కలవరం పెరుగుతోంది.
చైనా ఎప్పుడూ సరిహద్దు దేశాలతో తగాదాలు పెట్టుకుని, భూభాగం వివాదాస్పదం చేసి, కబ్జా చేసేయాలని చూస్తూ ఉంటుంది. ఇందుకు టిబెట్, భూటాన్, తైవాన్, హాంకాంగ్, ఇలా చాలా ఉదాహరణలున్నాయి. అసలు చైనా పరిధిలోకి తైవాన్, హాంకాంగ్ వస్తాయని ఐక్యరాజ్యసమితి ఎలా ఒప్పుకుందో ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడం లేదు. చైనా ప్లానింగ్ అలా ఉంటుంది.
ఓవైపు డోక్లాంలో ప్రతిష్ఠంభన కొనసాగుతుండగానే లడఖ్ లో కవ్వించిన చైనా.. ఇంకా నాలుగుచోట్ల చొరబాటుకు ఛాన్స్ ఉందని గుర్తించింది. దీంతో ఇండియన్ ఆర్మీ కూడా దీటుగా బదులు చప్పేందుకు రెడీ అవుతోంది. చైనా చర్యలు సమస్యను మరింత జటిలం చేసేలా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, ఎప్పుడైనా యుద్ధం రావచ్చని విదేశీ మీడియా అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు: