Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆలయవాణి రేడియో జాకీ పై లైంగిక వేధింపుల కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్ అయి కొన్ని రోజులు జైలుకి కూడా వెళ్లోచ్చిన సంగతి తెలిసిందే. గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధించడమే కాకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడంటూకరీంనగర్ జిల్లాకు చెందిన అరుణ అనే యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలోనే కేసులు నమోదు చేసి శ్రీనివా్‌సను అరెస్ట్ చేశారు. అయితే గజల్ శ్రీనివాస్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఓ మహిళ ఫోన్ చేసి తనను బెదిరిస్తోందని బాధిత మహిళ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 12న బాధిత మహిళకు విజయలక్ష్మి అనే మహిళ ఫోన్ చేసి బెదిరించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో బాధితురాలు మరోమారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు…కేసు నమోదుపై కోర్టు అనుమతి కోరుతూ లేఖ రాశారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం విజయలక్ష్మిపైఐపీసీ 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.