ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పి బీజేపీ ప్రజల్లో మైనస్ అయ్యింది అయితే ప్రత్యేక హోదా పోరాటంతో కాక మీద ఉన్న ఏపీ రాజకీయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు వస్తాయి వస్తాయి. ఏపీలో అధికార ప్రతిపక్షాల ప్రస్తుత బలా బలాలు ఏమిటి అనే విషయం మీద ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ టీం సర్వే చేసింది. కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…
టీడీపీకి 110, వైసీపీకి 60, ఇతరులుకి 05 సీట్లుగా తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని సర్వే అడిగితే టీడీపీకి 44.04, వైసీపీకి 37.46, జనసేనకి 8.90, కాంగ్రెస్ కి 1.18, బీజేపీకి 1.01కి, లెఫ్ట్ కి 0.95, ఇంకా నిర్ణయించుకోలేదు అనుకున్న వారు 5.4 మందిగా తేల్చింది.
ఏపీకి మోదీ అన్యాయం చేశారా ? అనే ప్రశ్నకు అవునని 83.67% మంది కాదని 16.33% మంది తేల్చారు…
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ ? అనే ప్రశ్నకు టీడీపీ 43.83 %, వైసీపీ 37.46%, జనసేన 9.65%, సీపీఐ-సీపీఎం 1.08 %, ఇతరులు 4.87 % అనే సమాధానం వచ్చింది…
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా ఉంది అన్న ప్రశ్నకు బావుందని 53.69 % మంది, బాగా లేదని 46.31 % మంది సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఈ సారి కూడా టీడీపీకే పట్టం అని తేల్చేసింది ఆర్జీ ఫ్లాష్ టీం.