దగ్గరగా దూరంగా….వైసీపీ నాటక రాజకీయం…!

Last Minute The Change Of The Minds Of The TRS Supported NDA

ఈ రోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్‌ సింగ్ విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజార్టీకి 122 మంది సభ్యులు అవసరం. దాని కన్నా బీజేపీ కూటమి అభ్యర్థికి మూడు ఓట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ తరపున నిలబడిన బీకే హరిప్రసాద్ పరాజయం పాలయ్యారు. ఆయనకు 105 ఓట్లు వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడయిన హరివంశ్ మొదటిసారి రాజ్యసభకు వచ్చారు. అయినా తొలి టర్మ్‌లోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

అయితే ఏపీ విషయానికి వస్తే తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పిన వైసీపీ ఎంపీలు చివరి క్షణంలో యూటర్న్ తీసుకున్నారు. ఓటింగ్‌కు గైర్హాజర్ అయ్యారు. దీంతో విపక్షాల అభ్యర్థికి ఓట్లు తగ్గిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు తృణమూల్‌, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ, సీపీఐ, జేడీఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. వైసీపీ, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు గైర్హాజర్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి 105 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడ వైసీపీ విషయాన్నీ ప్రస్తావించాలి ఎందుకంటే ముందు నుండీ అంటే తెలుగుదేశం బీజేపీలు కలిసున్నప్పటి నుండే బీజేపీకి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉంది. కానీ తెలుగుదేశం వల్ల బయట నుండే మద్దతు ఇస్తూ వచ్చింది, ఇది రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలాంటి మరికొన్ని కీలక సమయాల్లో కూడా ఇస్తూ వచ్చింది.

harivasan-singh

అయితే కొద్ది నెలల క్రితం బీజేపీతో తెలుగుదేశం విడిపోయిన నాటి నుండి వైసీపీ బీజేపీలు పొత్తు పెట్టుకుంటాయి అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇరు పార్టీల నేతలు వాటిని ఖండిస్తున్నా ప్రజల్లో మాత్రం అనుమానం అలానే పేరుకుపోయి ఉంది. దీంతో ఇప్పట్లో కలవొద్దని నిర్ణయించుకున్నారో ఏమో ? అప్పుడప్పుడు టీడీపీతో పాటు బీజేపీ మీద కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా రాజ్య‌స‌భ డెప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థికిగానీ, లేదా ఎన్డీయే ప‌క్షాల నుంచి బ‌రిలోకి దిగే అభ్య‌ర్థికిగానీ వైకాపా మ‌ద్ద‌తు ఇవ్వ‌దని ఆ పార్టీ ఏ 2 విజ‌య‌సాయి రెడ్డి చాలా స్ప‌ష్టంగా చెప్పారు.

ఇంత‌కీ, వైకాపా ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వను అంది అంటే కేంద్రం ఇటీవ‌లే సుప్రీం కోర్డులో ఒక అఫిడ‌విట్ దాఖ‌లు చేసింద‌నీ, విభజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని భాజ‌పా చెప్పింద‌ని హోదా విష‌య‌మై భాజ‌పా అంతిమ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన‌ట్టుగా ఉంద‌నీ, కానీ ఇదే అంశ‌మై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగున్న‌రేళ్లుగా పోరాటం చేస్తోంద‌నీ, ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌మ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌నీ అందుకే, భాజ‌పాకి వ్య‌తిరేకంగా తాము ఓటేస్తున్నామ‌ని ఇంతే స్ప‌ష్టంగా పూస‌గుచ్చిన‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు.

kcr-harivasan

అదీ కాక ఈ ఎన్నిక వ్యవహరం తెరమీదకి వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేక పక్షానికి ఓటేస్తామని విజయసాయిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు కానీ అసలు ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా మాట మార్చేసి మడమ తిప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారనే కారణంగానే తాము ఎవరికీ ఓటు వేయమని ఇంతకు ముందు ఇతర పక్షాల అభ్యర్థిని నిలబెడతామని చెప్పారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే రంగంలోకి దించారని అందుకే ఎవరికీ వోటు వెయ్యలేడనే రీజన్చెబుతున్నారు విజయసాయిరెడ్డి. కానీ విజయసాయి సహా వైసీపీ నేతలు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా వైసీపీ వారు వోటింగ్ కి దూరం అయి ఎవరిని గెలిపించారో ? వారు బీజేపే నాయకులతో ఎంత దగ్గర సంబంధాలు నెరుపుతున్నారో ? ప్రజలకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ?