ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ హిట్స్ అయ్యిన మూవీ ల్లో జనవరిలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ “హను మాన్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ని నిర్మాణం వహించిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ లతో టాలీవుడ్ లో రానుండగా ఇప్పుడు తమ నెక్స్ట్ సినిమాపై అయితే ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నట్టుగా మూవీ లో నటీనటుల పేర్లుతో ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ తో చూపిస్తున్నారు.

రాఘవ్ ఆనందిలా పెళ్ళికి నిరంజన్ రెడ్డి అశ్విన్ రామ్ లు సాక్షులు అన్నట్టుగా నిర్మాత దర్శకుల పేర్లు కూడా పెట్టారు. మొత్తానికి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ను మేకర్స్ ఇపుడు అందించారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై మరో బజ్ కూడా వినిపిస్తుంది. ఈ మూవీ లో ప్రియదర్శి, నభా నటేష్ లు మెయిన్ లీడ్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది . దీనిపై రేపు ఏప్రిల్ 20 మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకి క్లారిటీ కూడా రానుంది. వేచి చూద్దాం ఈ కాంబినేషన్ లోనే వారి సినేమానా కాదా అనేది.
Writing the scripts of their lives
Will it be a happily ever after or just the beginning ?
Don't miss to Fall in Love, laugh and Marriage with a lot of chaos with our Raghav & Anandhi
Save the date: 20th April, 12.33 PM, Daspalla Convention
A @Primeshowtweets next,… pic.twitter.com/i6G3GJi5OK
— Primeshow Entertainment (@Primeshowtweets) April 19, 2024