అయ్యప్ప కి ఆగ్రహం వచ్చిందా?? జీసస్ జీవించ నివ్వను అంటున్నాడా ?? అల్లా ఆదుకొను అన్నాడా?? ఏం జరిగింది ?? ఆసలు ఎం జరుగుతుంది ?? దేవ్వుల్లు అందరు మూకుమ్మడిగా కేరళపై పగ పట్టారా ??అవును నిజమే అయ్యప్ప కి కోపం వచ్చిన మాట నిజమే .., అందమైన ప్రకృతిని మనిషి తన ఇష్టానికి నాశనం చేస్తే దైవానికి ఆగ్రహం రాదా మరి… జేబులు నింపుకోవడానికి జీసస్ ని వాడుకుంటే ఎలా జీవించనిస్తాడు …మంచి అన్నదే మరచిన మనిషిని అల్లా ఎందుకు ఆదుకుంటాడు ??
నువ్వు ఏది ఇస్తే అదే నీకు రెట్టింపు వేగం తో తిరిగి వస్తుంది .. అది ప్రకృతి ధర్మం .. మనిషిగా మన సుఖం , సౌకర్యం కోసం భూమి పోరాల్ని చీల్చాం , చెట్లను నరికాం , సమస్తం ప్లాస్టిక్ తో నింపేశాం …మనిషి లో మార్పు కోసం ప్రకృతి ఇన్నాళ్ళు ఎదురు చూసింది .. దిగజారిన మానవత్వపు విలువలను చూసి వగచింది.. ఆ కన్నీరే వరదగా మారి దైవ భూమిని శోక భూమిగా మార్చింది …
మనిషి తప్పులకు సజీవ సాక్షం వరదల్లో కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ .. భూమి తన లో కలిపెసుకోలేను అంటూ భారం గా , సాక్ష్యం గా వదిలిన గురుతులు … భూమి తనలో కరిగిపోనివి , తనలో కలిసి పోనివి భూమిలో వేస్తే ఒకరోజు అందుకు కారకులను తనలో కలిపెసుకుంటుంది .అది కూడ ఊహకి అందని వేగం , ఫలితంతో… మొన్న చెన్నై , ఈ రోజు కేరళ , రేపు ఇంకో నగరం … మనిషి మారనంత కాలం ప్రకృతి ఇలా గుణపాటం చెప్తూనే ఉంటుంది .గిర్లాని నివేదికని గాల్లో కలిపేసి , నిదులు నిక్షే పాల కోసం భూమిని చీల్చి , అడవులన్నదే లేకుండా చేద్దం .. ఒక నాటికి మనిషి ఆనవాలు లేకుండా ప్రకృతి చేస్తుంది . ప్రకృతిని దైవం గా కొలువు , తనకు అనుగుణం గా నడుచుకో నిన్ను ఆదరిస్తుంది , ఆదుకుంటుంది .. లేకపోతే నీతో ఆడుకుంటుంది , అప్పుడు వేడుకునే అవకాశం కూడా ఇవ్వదు .