ప్రేమికురాలి ఇంటి ముందు పురుగులమందు తాగి…!

Lover Commits Suicide In Front Of Girlfriend House

ప్రేమించి తనతో తిరిగిన అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తుందని ఓ యువకుడు అమ్మాయి ఇంటిముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన వికారాబాద్ లోని కుల్కచర్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చేవెళ్ల మండలం ఎర్రోనికొటాల గ్రామానికి చెందిన మహిపాల్‌(28) హైదరాబాద్లోని ఆచార్య ఎన్‌జీరంగ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తిచేశాడు.

suside-dead

అక్కడే తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన పరిమళ పరిచయం కావడంతో అది కాస్త ప్రేమగా మారింది. అయితే ముందు ప్రేమ ఒప్పుకున్నా ఆమె గత కొన్ని రోజుల నుంచి యువకుడు పెళ్లి మాట ఎత్తేసరికి నిరాకరిస్తు వస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు అమ్మాయి ఇంటిముందు పురుగుల మందు తాగాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరిగిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన యువకుడి జేబులో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

lover-suside