బాలీవుడ్ పరిశ్రమలో ‘ధక్ ధక్’ అమ్మాయిగా గుర్తింపు పొందిన మాధురీ దీక్షిత్ గత కొన్ని దశాబ్దాలుగా హృదయాలను శాసిస్తున్నారు. 70కి పైగా చిత్రాలతో ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.
ఇటీవలి జరిగిన ఇంటర్వ్యూలో మాధురీ దీక్షిత్‌తో తనకు జరిగిన ఓకే చేదు అనుభవాన్ని పంచుకున్నారు టిన్ను ఆనంద్. అదేంటంటే… 1989లో శనఖత్ అనే చిత్రానికి అమితాబ్ బచ్చన్ మరియు మాధురీ దీక్షిత్‌లు ముఖ్య పాత్రలో సంతకం చేశారట. ఐతే షూటింగ్ మొదటి రోజే మాధురితో ఆమె కాస్ట్యూమ్ విషయంలో వాగ్వాదం జరిగిందని అయన గుర్తుచేసుకున్నాడు.
అయితే ఒక సిన్ లో మాధురీ తెరపై బ్రా ధరించాలని టిన్ను చెప్పారంట. ఆ సిన్ లో తాను బ్లౌజ్ తీసి కేవలం బ్ర పైనే ఉండాలట. దానికి అనుగుణంగా తనకు నచ్చినట్టు తన సింత డిసైన్ లో బ్రా తయారుచేసుకోమని చెప్పారట. ఈ సిన్ ఆ సినిమాలోనే ముఖ్య సిన్, అందుకే దానిని మొదటి రోజే చిత్రీకరించాలనుకుంటున్నరు.
ఆ తర్వాత మాధురి ఆ సీన్ చేయనని కొట్టిపారేసింది. దాదాపు గంట పాటు ఆమె డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాలేదు. టిన్ను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆమె అతనితో, “తిన్నూ, నేను ఈ ప్రత్యేక సన్నివేశం చేయకూడదనుకుంటున్నాను” అని చెప్పారు. దీనికి టిన్నూ.. ‘క్షమించండి.. ఈ సీన్ నువ్వే చేయాల్సి ఉంటుంది’ అని బదులిచ్చారు. కానీ మాధురి ఒప్పుకోలేదు.
దీని తరువాత, అతను ఆమెను ప్యాకప్ చేసి సినిమాకు గుడ్ బై చెప్పమని చెప్పాడు. అయితే మాధురితో తన వాదన గురించి టిన్ను అమితాబ్ బచ్చన్‌కు తెలియజేశాడు. “అది వదిలేయండి. ఆమెతో ఎందుకు వాదిస్తున్నారు? ఆమె అభ్యంతరం చెప్పవలసి వస్తే సినిమాకి సంతకం చేసే ముందు చెప్పి వుండాలి” అని అన్నారు.
టిన్నూ వెంటనే మాధురి స్థానంలో వేరే నటి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. కాగా కొద్దిసేపటికి మాధురి సెక్రటరీ లోపలికి వచ్చి తనకు ఈ సిన్ చేయడం ఒప్పుకుంటున్న అని అంగీకారం తెలిపిందన్నారు.