Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. రచయితగా ఎన్నో సూపర్ హిట్స్‌ను దక్కించుకున్న వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారి సక్సెస్ అవుతాడని అంతా భావించారు. కాని అల్లు అర్జున్‌కు దర్శకుడు వంశీ సక్సెస్‌ను ఇవ్వలేక పోయాడు. దాంతో వక్కంతం వంశీకి కూడా కెరీర్ ఇబ్బందిలోకి నెట్టబడినది. ఈ చిత్రం సక్సెస్ అయితే ఈయనతో పని చేసేందుకు స్టార్స్ ఆసక్తి చూపించే వారు, కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ సమయంలోనే నా పేరు సూర్య చిత్రం కథ గురించి ఒక ఆసక్తికర చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది.
రచయితగా వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్న వక్కంతం వంశీతో సినిమాను చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. అప్పుడు రెడీ చేసిన కథ ‘నా పేరు సూర్య’ అని, అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కథ నచ్చక పోవడం వల్లే ఎన్టీఆర్ ఆ సినిమాకు నో చెప్పాడని నిన్న మొన్నటి వరకు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే నా పేరు సూర్య చిత్రం కథ మొదట మహేష్‌బాబు వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు హీరోగా అశ్వినీదత్ ఒక సినిమాను నిర్మించాలని భావించాడు. అందుకు వక్కంతం వంశీకి అడ్వాన్స్ ఇచ్చి కథను సిద్దం చేయాల్సిందిగా సూచించాడు. అప్పుడు నా పేరు సూర్య కథతో మహేష్‌బాబు వద్దకు వంశీ వెళ్లాడు. నిర్మొహమాటంగా ఈ కథ తనకు సెట్ అవ్వదని చెప్పేశాడట. దాంతో అడ్వాన్స్ తిరిగి తీసుకుని మరో దర్శకుడితో అశ్వినీదత్, మహేష్‌బాబుతో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక మహేష్‌బాబు వద్దని చెప్పిన కథనే బన్నీకి చెప్పగా ఆయన ఓకే చేయడం, సినిమా చేయడం జరిగిపోయింది. ఇలా ముగ్గురు ఈ కథను విన్నట్లుగా సినీ వర్గాల్లోగుసగుసలు వినిపిస్తున్నాయి.