Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ హీరోల్లో ఓవర్సీస్ స్టార్ అనిపించుకుంటున్నాడు మహేష్‌బాబు. సినిమా ఫ్లాప్ అయినా, సక్సెస్ అయినా కూడా మహేష్‌బాబు సినిమా అంటే ఓవర్సీస్లో కనీసం మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం ఖాయం. ఇక సక్సెస్ టాక్ తెచ్చుకుంటే రెండు లేదా మూడు మిలియన్ డాలర్లను మహేష్ మూవీ సునాయాసంగా వసూళ్లు చేస్తుంది. అందుకే మహేష్‌బాబు సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిర్మాతలు భారీ మొత్తాకు ఓవర్సీస్ రైట్స్‌ను అమ్మేస్తూ ఉంటారు. తాజాగా మహేష్‌బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం ఓవర్సీస్ రైట్స్ దూకుడు ప్రదర్శిస్తుంది.
తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ఓవర్సీస్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 16. 5 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో అమ్ముడు పోవడం గ్రేట్‌గా చెప్పుకోవచ్చు. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి కాకున్నా ఆ తర్వాత స్థాయిలో స్పైడర్ చిత్రం ఓవర్సీస్లో అమ్ముడు పోయింది. మురుగదాస్ మరియు మహేష్‌ల కాంబినేషన్‌పై ఓవర్సీస్ ఫ్యాన్స్ ఫుల్ క్రేజీగా ఉన్నారు. అందుకే ఓవర్సీస్ రైట్స్ ఇంత భారీ మొత్తంకు అమ్ముడు పోయింది. సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా ఒకే సారి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
మరిన్ని వార్తలు: