సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రం ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదని, కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందుకే మహేష్‌బాబు 25వ చిత్రాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయడం కష్టమే అని తేలిపోయింది. అందుకే ఈ చిత్రం కొత్త తేదీని నిర్ణయించారు. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావించి, అందుకు తగ్గట్లుగా ప్రణాళిక సిద్దం చేశారు. అయితే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలి అంటే షూటింగ్ హడావుడిగా చేయాల్సి వస్తుంది. అందుకే సంక్రాంతికి కాకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేస్తే పోయేది ఏమీ లేదని మహేష్‌బాబు అన్నట్లుగా తెలుస్తోంది.
మహేష్‌బాబు 25వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంను నిదానంగా పూర్తి చేసి, సమ్మర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతికి మహేష్‌బాబు 25వ చిత్రం వస్తుందని ఆశపడ్డ ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబు 24వ చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రం మొన్న వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే భరత్ అనే నేను చిత్రం సక్సెస్ సెంటిమెంట్‌ను యూజ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.