మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వ్యాపారంలో కూడా అదృష్టం చెక్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఆయన ఈ మద్యే ఓ మల్టీప్లెక్స్ కూడా ప్రారంభించారు. అంతేకాకుండా తన సొంత బ్యానర్‌పై కొన్ని సినిమాలకు భాగస్వామిగా కూడా వ్యవరిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ లాంటీ సినిమాలకు సహా నిర్మాతగా మారాడు. దీనికి తోడుగా సొంతంగా ఆయన ‘మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్’పై త్వరలో సినిమాలను నిర్మించబోతున్నారు. ఈ బ్యానర్ మీద ఇప్పటికే అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమాను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనికి తోడుగా మహేష్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును ఓకే చేశాడని తెలుస్తోంది. విజయ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకునిగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సూపర్ బ్లాక్ బస్టర్ అయిన తరువాత, దర్శకుడు సందీప్ వంగా మహేష్ వద్దకు వచ్చి ఓ ఆసక్తికరమైన కథను వినిపించాడు. ఈ కథను మహేష్ కూడా నచ్చడంతో త్వరలోనే వీరీద్దరు కలిసి ఓ సినిమా చేయనున్నారని .టాక్ కూడా వినిపించింది. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను స్వయంగా మహేష్ బాబు తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడని అంటున్నారు. ఇక ఎటూ విజయ్ దేవరకొండకి మహేష్ కి మంచి రాపో ఏర్పడింది, ఆ చనువుతోనే ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.