Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘స్పైడర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మహేష్‌బాబు కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌గా ఆ చిత్రం నిలిచింది. ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబు చేస్తోన్న చిత్రం ‘భరత్ అను నేను’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా నుండి అదుగో ఇదుగో అంటూ మహేష్ మూవీ ఫస్ట్‌లుక్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.
కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 31న ‘భరత్ అను నేను’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. సంక్రాంతికి ఏకంగా టీజర్ వస్తుందంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి కూడా మహేష్‌బాబు ‘భరత్ అను నేను’ ఫస్ట్‌లుక్ లేదని తేలిపోయింది. ప్రస్తుతం చిత్రీకరణతో బిజీగా ఉన్న కారణంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోవడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ చిత్రాల దెబ్బల నుండి తేరుకోవాలి అంటే ఈ చిత్రం మహేష్‌కు ఖచ్చితంగా సక్సెస్‌ను తెచ్చి పెట్టాలి. మరి మహేష్‌కు కొరటాల మరో సక్సెస్‌ను ఇస్తాడా లేదా అనేది తెలియాలి అంటే ఏప్రిల్‌లో సినిమా విడుదలయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.