Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘శ్రీమంతుడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన నేపథ్యంలో మహేష్‌బాబు నెం.1 హీరో అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. అయితే ఆ వెంటనే విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ మరియు ఇటీవల వచ్చిన ‘స్పైడర్’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి. దాంతో మహేష్‌బాబు నెం.1కు దగ్గరగా వచ్చి మిస్ అయ్యాడు. నెం.1కు పవన్, మహేష్‌ల మద్య తీవ్రమైన పోటీ నెలకొని ఉండేది. వరుసగా ఫ్లాప్‌లు రావడంతో పాటు, ఇటీవలే పవన్ సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు నెం.1 అయ్యేందుకు మంచి అవకాశం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెండు వరుస ఫ్లాప్‌ల తర్వాత కూడా మహేష్‌బాబు నటించిన ‘భరత్ అను నేను’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్లు చెబుతున్నాయి. భరత్ అను నేను చిత్రం సక్సెస్ అయ్యి, ఆ తర్వాత మహేష్ 25వ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంటే మహేష్‌బాబు టాలీవుడ్ నెం.1 హీరోగా నిలవడం ఖాయం అనేది విశ్లేషకుల అభిప్రాయం. మహేష్‌బాబును ఢీ కొట్టగల సత్తా ఉన్న హీరోలు టాలీవుడ్లో ప్రస్తుతం తక్కువగా ఉన్నారు. పలువురు హీరోలు భారీ విజయాలను దక్కించుకుంటున్నారు. కాని ఏ ఒక్కరు కూడా నిలకడగా రాణించడం లేదు. దాంతో మహేష్‌కు నెం.1 అయ్యే ఛాన్స్ ఎక్కువ అనడంలో అతిశయోక్తి లేదు.