Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేష్‌బాబు హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం మరి కొన్ని రోజుల్లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘స్పైడర్’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేయాలని భావించారు. దర్శకుడు మురుగదాస్‌కు ఉన్న క్రేజ్‌తో తమిళం మరియు హిందీలో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. అయితే మహేష్‌బాబుకు హిందీలో విడుదల చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. హిందీలో ఇప్పటి వరకు తెలుగు స్టార్ హీరోలు సక్సెస్ కాలేదు. మహేష్‌బాబు కూడా హిందీకి వెళ్లాలి అంటే కాస్త టెన్షన్ పడుతున్నట్లుగా అనిపిస్తుంది.
‘స్పైడర్’ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తే ఖచ్చితంగా 25 నుండి 35 కోట్లు రాబడుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులున్నారు. మురుగదాస్ గత చిత్రాలు హిందీలో మంచి ఫలితాన్ని సాధించాయి. అందుకే ‘స్పైడర్’ కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాని మహేష్‌బాబు మాత్రం సినిమా ఫస్ట్‌కాపీ సిద్దం అయిన తర్వాత చూసి, హిందీ ప్రేక్షకులను అలరిస్తుందా ఓపినియన్ తీసుకుని, అప్పుడు బాలీవుడ్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేద్దాం అంటూ నిర్మాతలతో చెబుతున్నాడట. ‘స్పైడర్’ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మురుగదాస్ తెరకెక్కించాడు. అయినా కూడా ఎందుకు మహేష్ ఇంతగా టెన్షన్ పడుతున్నాడో అర్థం కావడం లేదు. మహేష్‌బాబు ఈ చిత్రంతో తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని చిత్ర యూనిట్ సభ్యులు ఆశిస్తున్నారు.
మరిన్ని వార్తలు:
బాలయ్యని కమ్మేసిన పూరి హీరో.
తెలుగులోకి ఎంట్రీ ఇవ్వటం సంతోషంగా ఉంది
‘బిగ్‌బాస్’ ఇంట్లో తాప్సికి ఏం పని?