Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లధనం వెలికితీస్తామన్నారు. 4 ఏండ్లు గడిచిపోయింది. ఈ కాలంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. ఆ దెబ్బకు దాదాపు 6 నెలలు గడిచినా నోట్ల కష్టాలు తీరలేదు. పేద వాడే బాధలు ఎదుర్కొంటున్నాడే తప్పా, కోటీశ్వరులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తడం లేదు. తర్వాత జీఎస్టీ అన్నారు. పెద్దవ్యాపారుల్లో ముందు కాస్త ఆందోళన పడ్డా వారి ధరలు వారికి ఉండి వారు కూడా కుదుట పడ్డారు. ఎటు వచ్చి చివరికి ప్రజలపైనే భారాలు మోపి, అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఆయన నాలుగేళ్ల పాలనలో సగటుజీవి మీద పడిన పన్నుల భారం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయం భారీగా పెరుగుతున్నా.. రక్షణకు సంబంధించి కీలక విషయాల్లో ఇప్పటికి నిధులేమి వెంటాడటం ఆశ్చర్యానికి గురి చేయకమానదు.
కాంగ్రెస్ పాలనపై అదే పనిగా తీవ్ర విమర్శలు చేసి.. అధికారంలోకి వచ్చిన మోడీ తన నాలుగేళ్ల పాలన తర్వాత కూడా సైనికుడికి కనీస ఆయుధమైన రైఫిల్ కొనేందుకు అంతెందుకు సైనికుల యూనిఫాంకు కేటాయించే నిధుల్లో కోత విధించడం కొనాల్సిన వాటిల్లో కేవలం మూడో వంతును మాత్రమే కొనటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆధునిక రైఫిళ్ల కోసం పెడుతున్న ఆర్డర్‌ను భారీగా కుదించారు. కేవలం 2.5లక్షల రైఫిళ్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇవి అవసరమైన తుపాకీలతో పోలిస్తే కేవలం మూడో వంతు మాత్రమే కావటం ఇప్పుడు రక్షణ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పుడు మన దేశానికీ ఒక పక్క చైనా తో మరో పక్క పాకిస్తాన్ తో సత్సంబంధాలు లేవు ఈ నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాల అవసరం ఉంది.
అయితే.. ఇందుకు అవసరమైన నిధుల విషయంలో ఉన్న ఇబ్బందుల కారణంగా కనీస ఆయుధాల కొనుగోలు విషయంలోనూ కోతలు విధిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాలైన కాశ్మీర్.. నియంత్రణ రేఖ.. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో అత్యాధునిక ఆయుధాల్ని చేపట్టాల్సిన తక్షణ అవసరం సైన్యానికి ఉంది. అలాంటిది ఆయుధాల సంగతి దేవుడెరుగు ముందు మన సైనికుల దుస్తులు, షూలను వారే కొనుగోలు చేసేలా చేస్తోందని ఎకనమిక్ టైమ్స్‌లో ప్రచురితమయిన ఒక కధనం ఇప్పుడు కలకలం రేపుతోంది. మాట్లాడితే ప్రత్యేక జెట్ లు వేసుకుని ప్రపంచ దేశాలు చుట్టొచ్చే మోడీ రక్షణ శాఖ ఇంత దరిద్రంలో ఉందన్న విషయం ఎందుకు పట్టించుకోవట్లేదో మన మెదళ్ళకి అర్ధం కాని విషయం…మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేసద్రోహుల జాబితాలో చేర్చేసే మోడీ భక్తులు ఈ విషయం మీద ఏమని సమాధానం ఇస్తారో వేచి చూడాలి మరి.