ప్రముఖ మలయాళీ డైరెక్టర్ సాచీ కన్నుమూత..

సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ సనీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సాచీ కన్నుమూశారు. ఈ మధ్య తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న సాచీ.. త్రిస్సూర్‌లోని జూబ్లీ మిషన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు సమాచారం అందుతుంది. అందుకు సంబందించి ఈ నెల 16న గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు.

కాగా శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ.. చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు. దీంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. 2015లో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాచీ పూర్తిపేరు కేఆర్ సచ్చిదానందన్. పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్’ సినిమాకి గాను చివరిసారిగా పనిచేశారు. ఈ సినిమా మంచి సంచలన విజయాన్ని అందుకుంది.