Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్, బీజేపీ లకు సమదూరం పాటిస్తూ సరికొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే చుక్క ఎదురు అయినట్టు తెలుస్తోంది. బీజేపీ వ్యవహారశైలి మీద నిప్పులు చెరుగుతున్న మమతా కొన్నాళ్లుగా జాతీయ స్థాయిలో రాజకీయాల మీద దృష్టి సారించి వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అండ లేకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యం అని ఆమె గ్రహించారట. ఇదే విషయాన్ని తనతో భేటీ అయిన కెసిఆర్ తో ప్రస్తావించారట. కాంగ్రెస్ లేకుండా ఓ ప్రత్యామ్న్యాయ ఫ్రంట్ ఏర్పాటు ఎలా సాధ్యం అవుతుందని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తెరాస నేతలు ఇబ్బందిపడ్డారట. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ తో వున్న పోటీని దృష్టిలో ఉంచుకునే తెరాస ఇలా వ్యవహరిస్తోందని తృణమూల్ వ్యూహకర్తలు అంతకు ముందే చెప్పి ఉండటంతో ఆమె తెలివిగా ప్రస్తుత లోక్ సభలో పరిణామాలను కూడా చర్చలోకి తెచ్చారట. బీజేపీ మీద పోరాటం అంటూ లోక్ సభలో వారికి ఎందుకు సహకరిస్తున్నారని ఆమె అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం లేకపోయిందట.
తెరాస అగ్రనేతలతో భేటీ తరువాత ప్రెస్ ముందు కెసిఆర్ చెప్పిన మాటలు రిపీట్ చేయడానికి కూడా మమతా పెద్దగా ఆసక్తి చూపలేదని ఆమె మాట తీరు చూస్తే అర్ధం అవుతుంది. బీజేపీ , కాంగ్రెస్ లకి దీటుగా ఫ్రంట్ తయారు చేయాలని మమతా తొలుత భావించినా అది సాధ్యం కాదని ప్రాక్టికల్ గా ప్రయత్నించాక ఆమెకి అర్ధం అయ్యిందట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ సాయంతో ముందు బీజేపీ ని దెబ్బ కొట్టి ఆపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు నడపాలని ఆమె అనుకుంటున్నారట. అందుకోసం ఆమె కాంగ్రెస్ విషయంలో చంద్రబాబుని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ncp అధినేత శరద్ పవర్ తో మాట్లాడాక మమతా బెనర్జీ కాంగ్రెస్, టీడీపీ లను ఒకే ఫ్రంట్ లోకి తెచ్చే ఆలోచన మీద ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.