వేరే వ్యక్తితో ‘క్లోజ్’ గా ఉందని…ముక్కలు నరికి మూటగట్టాడు !

Man Brutally kills His Lover

తన ప్రియురాలు వేరే యువకుడితో సన్నిహితంగా మెలగడం చూసి తట్టుకోలేని ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రాంత పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అందుతున్న వివరాల ప్రకారం రివాజ్‌ ఖాన్‌ (20) అనే యువకుడు ఓ మైనర్‌ బాలికను గత 11 నెలలుగా ప్రేమిస్తున్నాడు. కానీ అతన్ని తిరిగి ఆమె ప్రేమించలేదని  ఆ బాలిక గతకొంత కాలంగా వేరే యువకుడితో చనువుగా ఉంటోందని ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

Attack On Lover In Hyderabad

మంగళవారం సాయంత్రం ఇదే విషయంపై ఇద్దరి మధ్య స్పల్ప వాగ్వాదం జరిగింది. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. అంతేకాకుండా శవాన్ని రెండు ముక్కలుగా చేసి గొనె సంచిలో ప్యాక్‌ చేసి సమీపంలోని బారాపుల్లా ఫ్లైఓవర్‌ కిందగల మురికి కాలువలో పడేశాడు. హత్యచేసిన అనంతరం తానే స్వయంగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. తన ప్రేయసి వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న కారణంతో ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతని సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.