Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీని నీచమైన మనిషిగా అభివర్ణించి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని కోల్పోయిన మణిశంకర్ అయ్యర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. అయ్యర్ తనను చంపడానికి పాకిస్తాన్ లో సుపారీ ఇచ్చాడని ఆరోపించడం కూడా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు మణిశంకర్ అయ్యర్ ఎవరో తెలుసుకోడానికి చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు మోడీని చాయ్ వాలా గా పిలిచి బీజేపీ విజయానికి పరోక్షంగా దోహదం చేసిన మణిశంకర్ అయ్యర్ కి వివాదాలు కొత్త కాదు… ఎంతటివాళ్లను అయినా చిన్న మాటతో తీసిపారేయడం మణికి అలవాటే. ఈ విషయంలో ఆయన సోనియా గాంధీని కూడా టార్గెట్ చేసేవాళ్ళు అన్నది తాజాగా బయటపడింది.
మణిశంకర్ నోటిదూకుడు చూసి ఆయన చదుకోలేదేమో అనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదు. ఎంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఆయన చదువుకున్నారు. డూన్స్ స్కూల్ , సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ , కేంబ్రిడ్జి యూనివర్సిటీల్లో మణి విద్యాభ్యాసం సాగింది. Ifs పూర్తి చేసి దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. 1980 ల్లో రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్నప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో సోనియా గాంధీకి ఉపన్యాసాలు కూడా రాసి పెట్టారు. అయితే చేసే పనికి , ఆయన మాట్లాడే మాటలకు పొంతన తక్కువ.
ఒకప్పుడు గాంధీ కుటుంబానికి వీరవిధేయుడుగా ఉన్న నట్వర్ సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ సందర్శకుల పుస్తకంలో తాను ఇంత వాడిని కావడానికి ఈ కాలేజీ కారణం అని రాసారు. దాని కిందే “ అయ్యో కాలేజీని ఎందుకు నిందిస్తారు “ అని రాసిన గడసరి మణిశంకర్ అయ్యర్. కాంగ్రెస్ లో పనిచేస్తున్నా ఆ పార్టీ పాకిస్తాన్ తో వ్యవహరించే తీరును మణిశంకర్ తీవ్రంగా తప్పుబట్టేవారు. ఇక మన్మోహన్ సింగ్ ఆర్ధిక విధానాలను కూడా అదే స్థాయిలో ఏకిపారేసేవారు.
సొంత పార్టీ వాళ్ళని ప్రైవేట్ సంభాషణల్లో , బయట పార్టీ వాళ్ళని బహీరంగంగా విమర్శిస్తారు తప్ప ఎవరినీ వదిలే రకం కాదు మణి. ఈ విషయం సోనియా గాంధీకి కూడా బాగా తెలుసంట. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో స్థానం కల్పించ లేదని అలిగిన అయ్యర్ భలే కామెంట్స్ చేశారు . కాంగ్రెస్ లో గుర్తింపు రావాలంటే రెండు అర్హతలు ఉండాలి. ఒకటి డిగ్రీ ఉండకూడదు, ఇంకొకటి గుండెకు బైపాస్ సర్జరీ అయి ఉండాలి అని మణిశంకర్ అన్న మాటలు కాంగ్రెస్ లో పెద్ద చర్చకు దారి తీశాయి . ఓ సారి 10 జన్ పథ్ లో సోనియా ని విమర్శిస్తుంటే ఆమె స్వయంగా పక్క గదిలో నుంచి మణి నేను ఇక్కడే వున్నా అని చెప్పుకున్నారంట. ఇలాంటివి చూసీచూసీ విసిగిపోయిన కాంగ్రెస్ హైకమాండ్ మోడీని తిట్టారని మణిని సాగనంపింది. అదే రాజకీయాల్లో చిత్రం. గాంధీ ఫామిలీ కి విధేయత కోసం పోటీ పడ్డ నట్వర్ సింగ్ లాగానే ఒక్క రోజు , ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ తో మణికి అన్ని బంధాలు తెగిపోయాయి.