Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దీపిక పదుకునే టైటిల్ రోల్‌లో నటించిన ‘పద్మావత్’ చిత్రం దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద వివాదానికి తెర లేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్‌పుత్ వంశస్థులను అవమానపర్చే విధంగా ఆ చిత్రం ఉందని, ఒక వేళ ఆ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వందల సంఖ్యలో ఆత్మహుతికి సిద్దం అవుతారు అంటూ కర్ణిసేన హెచ్చరించింది. ఎన్నో వివాదాలు, విమర్శలు, గొడవల మద్య పద్మావత్ విడుదలైన విషయం తెల్సిందే. పద్మావత్ చిత్రం తర్వాత ఇప్పుడు కంగనా రనౌత్ హీరోయిన్‌గా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మణికర్ణిక’ చిత్రంపై అచ్చు అలాంటి ఆరోపణలు, గొడవలు చెలరేగుతున్నాయి.
క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటిస్తున్న ‘మణికర్ణిక’ చిత్రం జాన్సి లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతుంది. ఆ చిత్రంలో తాము ఎంతగానో అభిమానించి, ఆరాధించే రాణిని తప్పుగా చూపిస్తున్నారని, చరిత్రను వక్రీకరించి చూపించే ప్రయత్నం జరుగుతుందని రాజస్తాన్ సర్వ బ్రహ్మణ మహాసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపర్చే విధంగా తమ రానిని తప్పుగా చూపిస్తూ చేస్తున్న సినిమాను వెంటనే ఆపేయాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది.
ఒక బ్రిటీష్ వ్యక్తితో రాణి జాన్సి ప్రేమలో పడ్డట్లుగా సినిమాలో చూపించబోతున్నట్లుగా తమకు సమాచారం ఉందని, బ్రిటీష్ వారు రాసిన కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తూ, చరిత్రను వక్రీకరించి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన చేస్తున్నారు. సినిమాను విడుదల కానిచ్చేది లేదు అంటూ ఇప్పటి నుండే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల సమయంకు ఇంకా పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందిస్తున్న విషయం తెల్సిందే.