బాలీవుడ్లో తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రం తెలుగులో కూడా విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే మణికర్ణిక హిందీ ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సహజంగా రెండు మూడు భాషల్లో విడుదల చేయాలనుకున్నప్పుడు అన్ని భాషల్లో కూడా ట్రైలర్లను ఒకేసారి విడుదల చేయాల్సి ఉంటుంది. కాని కొన్ని కారణాల వల్ల తెలుగు ట్రైలర్ కాస్త ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మణికర్ణిక తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే మద్యలో ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. అయినా కూడా ఇది క్రిష్ సినిమాగా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
వీరనారి జాన్సీలక్ష్మీ భాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్సీ రాజ్యంను లక్ష్మీ బాయి బ్రిటీష్ వారి నుండి ఎలా కాపాడుకునేందుకు పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ఎక్కువగా యుద్ద సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. లక్ష్మీబాయిగా కంగనా రనౌత్ అద్బుతమైన నటనను కనబర్చినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. తప్పకుండా ఈ చిత్రం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందంటున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. దాంతో అంచనాలు మరింతగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంకు క్రిష్‌తో పాటు కంగనా కూడా దర్శకత్వం వహించింది. ఆ విషయాన్ని టైటిల్ కార్డులో కూడా వేస్తున్నారు. ఇద్దరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే ఈనెల 25 వరకు వెయిట్ చేయాల్సిందే.