Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ కావాలని ఆశించింది. కాని ఆమె ఆశలు తీరలేదు. నిర్మాతగా, నటిగా టాలీవుడ్‌కు దగ్గరగా ఉంటూ వచ్చిన మంజుల తాజాగా ‘మనసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. మహేష్ బాబు సోదరి సినిమా అవ్వడంతో ‘మనసుకు నచ్చింది’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 16 న రిలీజ్ కాబోతున్న మనసుకు నచ్చింది సినిమా గురించి మీడియాతో మాట్లాడిన మంజుల ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్లో కృష్ణ, మహేష్ బాబుల తర్వాత పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా అభిమానమని మంజుల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
మంజుల ఇంకా పవన్ గురించి మాట్లాడుతూ … పవన్ వ్యక్తిత్వం మరియు ఆయన లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం, ఆయన కోసం ఒక మంచి కథ నా వద్ద ఉంది. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయాలని, పవన్‌ను డైరెక్ట్ చేయాలనే కోరిక నాకు ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సినిమా చేసే ఆలోచనలో లేడని తెలిసినా కూడా ఒక్కసారి నా వద్ద ఉన్న సబ్జెక్ట్‌ను ఆయన వద్దకు తీసుకు వెళ్లాలని ఉంది అంటూ పేర్కొంది. మీడియా వారు పవన్ కళ్యాణ్‌తో నేను సినిమా చేయాలనుకుంటున్న విషయాన్ని చెబితే బాగుంటుంది. పవన్ ఒక్క సినిమా చేసే ఆలోచన చేయాలని, అది నా దర్శకత్వంలో ఉండాలని కోరుకుంటున్నట్లుగా మంజుల చెప్పింది. పవన్‌పై మరీ ఇంత అభిమానంను మంజుల దాచుకుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపస్తున్నాయి. మంజుల వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ సానుకూలంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో మీరిద్దరి కాంబోలో మూవీ రావాలని కోరుకుంటున్నాం అంటూ పోస్ట్ చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.