‘మన్మధుడు 2’ పై చైతూ ఫుల్‌ క్లారిటీ…!

Manmadhudu Movie Sequel

నాగార్జున, సోనాలి బింద్రె జంటగా చాలా సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మన్మధుడు’. విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ను అందించాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్‌ హిట్‌ అయిన ఆ చిత్రంకు సీక్వెల్‌ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్‌ వారు ‘మన్మధుడు 2’ అనే టైటిల్‌ను కూడా రిజిస్ట్రర్‌ చేయించారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ సీక్వెల్‌కు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తాడని, నాగచైతన్య హీరోగా ఆ చిత్రం తెరకెక్కబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

manmadhudu

తాజాగా ఆ వార్తలపై నాగచైతన్య ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడు. ‘మన్మధుడు 2’ చిత్రం తెరకెక్కబోతున్న విషయం నిజమే, కాని త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోవడం లేదని, అసలు అది ‘మన్మధుడు’ చిత్రానికి సీక్వెల్‌ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. మన్మధుడు సినిమా సీక్వెల్‌ అంటూ వస్తున్న వార్తలపై చైతూ ఊహాగాణాలకు తెర దించాడు. ‘చిలసౌ’ చిత్ర దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రం కోసం ‘మన్మధుడు 2’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. ‘మన్మధుడు’ కథతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆ చిత్రం తెరకెక్కుతుందని చైతూ చెప్పుకొచ్చాడు. ‘మన్మధుడు 2’ చిత్రంలో నటించేది ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

manamadhudu-nagrjuna