మనోజ్‌ జోక్‌ చేశాడా?

Many people think that Manchu Manoj jokes that leaving Acting

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంచు మనోజ్‌ తాను ప్రస్తుతం చేస్తున్న సినిమా, కమిట్‌ అయిన సినిమాలే తన చివరి సినిమాలు. ఇంత కాలం నన్ను సపోర్ట్‌ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మంచు మనోజ్‌ ట్విట్టర్‌ మరియు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. దాంతో అంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మంచు మనోజ్‌ ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటున్న సమయంలోనే ఫేస్‌బుక్‌ మరియు ట్విట్టర్‌ నుండి ఆ పోస్ట్‌లు తొలగి పోవడం మళ్లీ చర్చకు దారి తీసింది. మనోజ్‌ ఎందుకు పోస్ట్‌ చేశాడు, ఎందుకు ఆ పోస్ట్‌లను డిలీజ్‌ చేశాడు అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది.

మంచు మనోజ్‌ చాలా జోవియల్‌ పర్శన్‌. షూటింగ్స్‌ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులతో చాలా జాలీగా గడుపుతూ ఉంటాడు, అలాగే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా కూడా మనోజ్‌ సరదాగా అందరితో ఉంటాడు. అలాంటి మనోజ్‌ తన ‘ఒక్కడ మిగిలాడు’ చిత్రం ప్రమోషన్‌ కోసం ఇలాంటి జోక్‌ వేశాడా లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి మరియు ఇతరత్ర కారణాల వల్ల నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఉదయం నుండి మంచు మనోజ్‌ విషయమై సోషల్‌ మీడియాతో పాటు సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. మంచు మనోజ్‌ మీడియా ముందుకు వస్తే తప్ప ఈ గందరగోళంకు ఒక ఫుల్‌ స్టాప్‌ పడే అవకాశం కనిపించడం లేదు.