బంగ్లాతో మ్యాచ్..భారత్ బ్యాటింగ్

match with bangladesh

ఇంగ్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న కోహ్లీసేన బంగ్లాపై గెలుపుతో బెర్తు ఖాయం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 13 పాయింట్లతో ఇండియా నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఆదివారం భారత్, ఇంగ్లాండ్ తలపడిన పిచ్ మీదే ఇవాళ్టి పోరు జరుగుతోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు సాధించొచ్చు.