Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీవీ 9, ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్‌ను నిషేదించాలని కోరుతూ పవన్ తన అభినమానులకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మీడియా కధనాలను వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ ట్విటర్లో వ్యాఖ్యలు, ఆరోపణల పట్ల కొన్ని జర్నలిస్టులు అభ్యతరం తెలుపుతూ నిరసన మొదలుపెట్టారు. ఆయా చానెళ్ళ మీద అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారం చేసిన పవన్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే పవన్ వీరి డిమాండ్లపై స్పందించకపోగా… ట్విట్టర్లో తన ట్వీట్స్ వార్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
తనకు, తన తల్లికి జరిగిన అన్యాయంపై, మీడియా ప్రసారం చేసిన కథనాలపై తన దైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే Tv9, ఏబీఎన్ ల గురించి ట్విట్టర్ ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ… ఆయా చానెళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసినందుకు గాను పవన్ కళ్యాణ్ మీద ఐపీసీ సెక్షన్ 469, 504, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదైంది. ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఎలక్ట్రానికి ఎవిడెన్స్ ట్యాపరింగ్ చేసినట్టు వెల్లడి కావడంతో కేసును రిజిష్టర్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.