Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటిదాకా ఎంపీగా, మంత్రిగా ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డ వెంకయ్య నాయుడు.. రాజ్యసభ ఛైర్మన్ గా ఫస్ట్ స్పీచ్ లోనే మీడియాను సుతిమెత్తగా మందలించారు. రాజ్యసభలో జరుగుతున్న అర్థవంతమైన చర్చల్ని ప్రచురించకుండా.. కేవలం గొడవలనే హైలైట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా తీరు మారాలని ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య చెప్పడం మీడియా సంస్థల్ని టెన్షన్ పెడుతోంది.
ఇకపై ప్రతిపక్షాల్ని విమర్శించే ఛాన్స్ లేదు కాబట్టి.. మీడియాపై పడతారేమోనని ఒకటే ఇదైపోతున్నాయి ఛానెళ్లు, పేపర్లు. మరి సమాచార శాఖ మంత్రిగా మీడియాను ఎక్కడ ఉంచాలో అక్కడుంచిన వెంకయ్య.. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి.. మరింత కంట్రోల్ చేస్తారేమోనని అవి భయపడుతున్నాయి. మోడీకి పాజిటివ్ వార్తలు రావడంలో వెంకయ్య పాత్ర చాలా ఉంది. మరి ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన బాగా క్రియాశీలకంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడే వెంకయ్యకు.. అన్ని పేపర్లమీదా, మేనేజ్ మెంట్ పాలసీల మీదా సంపూర్ణమైన అవగాహన ఉంది. 30 ఏళ్లుగా ఢిల్లీలో ఉండి అన్నీ అబ్జర్వ్ చేసిన వెంకయ్య.. ఇక రంగంలోకి దిగుతారని మీడియా భయపడుతోంది. మరి వెంకయ్య ఫస్ట్ స్పీచ్ తో మీడియా దారికొస్తుందా.. లేదంటే ఎప్పటిలాగే దీన్ని లైట్ తీసుకుంటుందా అనేది ఆసక్తికరమే.
మరిన్ని వార్తలు: