ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో పవన్ కింగ్ కానున్నాడా ?? కింగ్ మేకర్ ఆ ?? కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఎక్కువని చాలా మంది భావించినప్పటికీ, ప్రజారాజ్యం పరిస్థితే మల్లి పునరావృతం అయ్యే అవకాలు ఎక్కువ అని సమాచారం… రాష్ట్ర రాజకీయాలు , పరిస్థితుల పైన అవగాహన లేక పోవడం , రెండవ శ్రేణి నాయకులు అంటూ ఎవరూ లేకపోవడం మల్లి గత పరిస్థితి పునారావృతం అవడానికి ఆస్కారం ఇస్తుంది..
పార్టీ కి అంటూ పటిష్టమైన నాయకత్వ శ్రేణి లేకపోవడం , ఎన్ని స్థానాలు ఉంటాయి ?? ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి అనే అవగాహన లేకపోడం , వేరే పార్టీ తో జత కడితే వచ్చే లాభ నష్టాలను బేరీజు వేసుకోలేక పోవడం ఇవన్నీ జనసేన ని మరో ప్రజారాజ్యం తో పోల్చే అవకాశం ఇస్తున్నారు ..లెఫ్టిస్టు పార్టీ లతో జత కట్టి , కమలనాథుల భజన చేయడం …. జగన్ తో జత కట్టడానికి మొగ్గు చూపడం .. అసలు పవన్ సిద్ధాంతం ఏంటో అసలు సిద్ధాంతమంటూ ఉందో లేదో కుడా ఎవరికి అంతు చిక్కట్లేదు ..చిరు ని అరవింద్ తెర వెనక నుండి నడిపించినట్లు పవన్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నడిపిస్తున్నాడని ఒక వాదు ఉంది … స్క్రిప్ట్ రాసిస్తే తప్ప సొంతం గా మాట్లాడటం , స్పందించడం తెలియదని ఇప్పటికే విమర్శ ఉంది .. ఆ విమర్శల ను దాటుకుని పవన్ కింగ్ అవుతాడో , కింగ్ మేకర్ అవుతాడో కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది ..