మెగా ఫ్యామిలీ నుండి ఇటీవలే కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగాస్టార్ చిన్నల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ ‘విజేత’తో విజయాన్ని దక్కించుకుంటాడు అని అంతా భావించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా కళ్యాణ్ వెనుక నిలబడ్డారు. కాని మెగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అంతా కూడా చిత్రాన్ని తిరష్కరించారు. మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో కళ్యాణ్ తీవ్రంగా నిరాశ పడుతున్నాట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మెగా హీరో అనే బ్రాండ్ నేం ఉన్నప్పటికి కళ్యాణ్ నటించిన విజేత చిత్రం కనీసం రెండు కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది. ఇంతటి దారుణమైన ఫ్లాప్‌ను మెగా కంపౌండ్ జీర్ణించుకోలేక పోతుంది.
కళ్యాణ్‌దేవ్‌కు ఎదురైన అనుభవంను ముందు ముందు రాబోతున్న మెగా హీరోలకు ఎదురు కాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్త పడుతుంది. గత కొన్ని నెలలుగా చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు సంవత్సర కాలంగా వైష్ణవ్ సినిమాల కోసం రెడీ అవుతున్నాడు. వైష్ణవ్ కోసం ఇప్పటికే కథను రెడీ చేయడంతో పాటు, దర్శకుడితో కూడా చర్చలు పూర్తి అయ్యాయి. అయితే విజేత ఫలితం తర్వాత కథ మరియు దర్శకుడి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి మెగా కంపౌండ్ వచ్చింది. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు మంచి, స్క్రిప్ట్‌తోనే, ట్యాలెంటెడ్ దర్శకుడితోనే వైష్ణవ్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నారు. నటన పరంగా, యాక్షన్, డాన్స్ పరంగా పర్ఫెక్ట్ అయ్యే వరకు వైష్ణవ్‌ను యాక్టింగ్ స్కూల్‌కు పంపించాలని మెగా కుటుంబం పెద్దలు నిర్ణయించుకున్నారు. వైష్ణవ్ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కి, వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.