నిహారిక తిక్క పని!!

Mega Fans Talk About Niharika next Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mega Fans Talk About Niharika Next Movie

మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు పట్టుబట్టి బుల్లి తెరపై, అటుపై వెండి తెరపైకి వచ్చింది. బుల్లి తెరపై పర్వాలేదు అనిపించుకున్న మెగా ప్రిన్స్‌ నిహారిక వెండి తెరపై మొదటి సినిమాతో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ‘ఒక మనస్సు’ చిత్రంతో నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెల్సిందే. నిహారిక మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే ఆ సినిమా ఆడదని భావించిందట. అయితే కథ బాగుండటంతో పాటు, నటిగా తనకు మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

దర్శకుడు కథ చెబుతున్న సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి కథ ఎక్కదని ఒక సగటు సినిమా ప్రేక్షకురాలిగా భావించాను అని, అయితే దర్శకుడు నమ్మకంగా ఉండటంతో పాటు కథ, పాత్ర నచ్చడం వల్లే ‘ఒక మనస్సు’ చిత్రాన్ని చేశాను అంటూ చెప్పుకొచ్చింది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా చేసే ఏ సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులను ఆధరించడం అసాధ్యం. తెలుగు సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తప్పనిసరి. అందుకే రెండవ సినిమాలు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా నిహారిక చూసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి చేసిన తిక్కపని మళ్లీ చేయవద్దని నిహారికను సున్నితంగా మెగా ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తాలు:

సరైన టైంలో వస్తున్న ‘డీజే’

కథలో రాజకుమారి మూవీ ట్రైలర్ అదరహో…