చరణ్‌కు గాయాలు.. ఎక్కడంటే?

ram charan was injured in the ranghasthalam 1985 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ram Charan Was Injured In The

Ranghasthalam 1985 Movie

రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోదావరి జిల్లాల్లోని పల్లెటూర్లలో ఈ సినిమా గత కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆన్‌ లొకేషన్‌ పిక్స్‌ కూడా సోషల్‌ మీడియాలో కనిపించాయి. ఆ ఫొటోల్లో చరణ్‌ పిచ్చ మాస్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా సుకుమార్‌ సినిమాకు సంబంధించిన సీన్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. చరణ్‌ కూడా చాలా జోష్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో చరణ్‌కు షూటింగ్‌లో స్వల్ప గాయాలు అయ్యాయి.

షూటింగ్‌ సందర్బంగా చిన్న యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరిస్తుండగా చరణ్‌కు ఈ గాయం అయినట్లుగా సమాచారం అందుతుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఈ విషయాన్ని నిర్థారించలేదు. అలాగే చరణ్‌ పీఆర్‌ఓలు కాని, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు కాని ప్రమాదం గురించి, గాయాల గురించి నోరు విప్పలేదు. అయితే చిత్ర యూనిట్‌లోని కొందరు అనధికారికంగా గాయం అయ్యిందని, అయితే పెద్దదేం కాక పోవడంతో వెంటనే షూటింగ్‌లో చరణ్‌ పాల్గొంటున్నాడని చెబుతున్నారు. డాక్టర్లు ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి కావాలని చెప్పినా కూడా చరణ్‌ వినకుండా అదే రోజు నుండి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు

బన్నీ గత జన్మలో ఏంటో తెలుసా?

ఫిల్మ్‌ఫేర్‌లో వారికి అవమానం