మెహబూబా మూవీ రివ్యూ … తెలుగు బులెట్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు: ఆకాశ్ పూరి, నేహాశెట్టి, విషు రెడ్డి, ముర‌ళీశ‌ర్మ‌, జ్యోతి రానా, షాయాజీ షిండే, అజ‌య్‌, పృథ్వీ త‌దిత‌రులు
సంగీతం: స‌ందీప్ చౌతా
సినిమాటోగ్రఫి : విష్ణుశ‌ర్మ
ప్రొడ్యూసర్ : పూరి క‌నెక్ట్స్‌
ద‌ర్శ‌క‌త్వం : పూరి జ‌గ‌న్నాథ్‌

ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌ పూరి చాలా రోజులు తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్‌ హీరోగా రీలాంచ్‌ అయ్యాడు. చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్‌ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనకి కూడా ఈ సినిమా రీలాంచ్‌ లాంటిది అంటూ ప్రచారం చేసింది చిత్ర యూనిట్. పూరి తన రెగ్యులర్‌ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ ల‌వ్‌స్టోరీ తెర‌కెక్కించాడు. ఆ సినిమాయే `మెహ‌బూబా`. ఓ డిఫరెంట్‌ జానర్‌లో డిఫరెంట్‌ టేకింగ్‌తో చేసిన మెహబూబా పూరికి విజయాన్ని అందించినదా లేదా అనేది చూద్దాం.

స్టోరీ లైన్ :

రోష‌న్‌(ఆకాశ్ పూరి) మిల‌ట‌రీలో చేరాల‌నుకుంటుంటాడు. అత‌నికి చిన్నప్పట్నుంచి ఏవో క‌ల‌లు వ‌స్తుంటాయి. ఆ క‌ల‌లో అత‌ణ్ని ఎవ‌రో చంపేసిన‌ట్టు అత‌నికి అనిపిస్తుంటుంది. ఉలిక్కిప‌డి నిద్ర లేస్తుంటాడు. అదే సమయంలో హిమాలయాల్లో తాను ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చానని… ఒకే కల పదే పదే వస్తుంటుంది. అలాగే పాకిస్థాన్‌లో అఫ్రీన్‌(నేహాశెట్టి)కి కూడా దాదాపు ఇలాంటి కలే వస్తుంది. ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్‌, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా… అఫ్రీన్‌ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియాలోని హైద‌రాబాద్ చేరుకుంటుంది.

ఓ సంద‌ర్భంలో అఫ్రీన్ గురించి తెలియ‌కుండానే ఆమెను ఓ ప్రమాదం నుండి ర‌క్షిస్తాడు రోష‌న్‌. అందువ‌ల్ల రోష‌న్‌కి థాంక్స్ చెప్పాల‌ను అఫ్రీన్ అత‌ని కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అప్పటికే అఫ్రీన్ తండ్రి (ముర‌ళీశ‌ర్మ‌) ఆమెకు న‌దిర్‌ (విషు రెడ్డి)తో పెళ్లి నిశ్చయిస్తాడు. న‌దిర్ ఎలాగైనా అఫ్రీన్‌ను పెళ్లి చేసుకోవాల‌ని అబ‌ద్ధం చెప్పి పాకిస్థాన్ ర‌ప్పిస్తారు. ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే ట్రెయిన్‌లో ఆఫ్రీన్‌ను క‌లుస్తాడు రోష‌న్‌. అత‌ను స్నేహితుల‌తో క‌లిసి హిమాల‌యాకు ట్రెక్కింగ్ వెళుతుంటాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది అఫ్రీన్. హిమాలయాలకి ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన‍్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. అసలు అఫ్రీన్ కి రోషన్ కి సంబంధం ఏంటి? ఇండియాలోని రోష‌న్‌, పాకిస్థాన్‌లోని అఫ్రిన్ క‌లుసుకుంటారా? అసలు రోషన్‌కు తన గతం ఎలా తెలిసింది..? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

పూర్వజన్మల కాన్సెప్ట్‌తో తెలుగులో వచ్చిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆ బ్యాక్ డ్రాప్‌లోనే తెరకెక్కించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సాదాసీదాగా ఉంది. హీరోగా ఆకాష్ పూరిని ఎలివేట్ చేయడానికి పూరి చాలా కష్టపడ్డాడు. దాదాపు సినిమా అంతా ఆకాష్ ఎలివేషన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమాలో పూరి మార్క్‌ హీరోయిజం, డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. కథనంలో వేగం లేకపోవటం, ఏ మాత్రం లాజిక్‌ లేని సన్నివేశాలు ఇది పూరి సినిమానేనా అన్న భావన కలిగిస్తాయి. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్‌ చౌతా పరవాలేదనిపించాడు.

సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి. యాక్షన్‌ సీన్స్‌ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరోగా ఆకాష్ పూరి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటన పరంగా మెప్పించాడు. యాక్షన్ సీన్స్ హెవీగా లేకుండా ఆకాష్ కోసం సింపుల్‌గా డిజైన్ చేశారు. వాటిల్లో అవలీలగా నటించేసాడు ఆకాష్. అయితే తెరపై హీరోగా ఆయన్ను యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులను మరో రెండు, మూడేళ్ళు పడుతుంది. ఎంత మేకోవర్ చేసినా ఆకాష్‌లో ఆ పిల్లతనం పోలేదనిపిస్తుంది.

క్లైమాక్స్ లో ‘ఇస్లాం జిందాబాద్ అని ఒప్పుకున్నవాడు… పాకిస్థాన్ జిందాబాద్ అనడానికి మాత్రం అంగీకరించడు’ ఇది ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా చేసింది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోని ప్రేమ‌, ఇప్పటి ప్రేమ స‌న్నివేశాల్లో ఎమోష‌న్స్ ఉండ‌వు. అందువ‌ల్ల ప్రేమ‌క‌థ మ‌న‌సుని తాక‌దు. బ‌ల‌మైన విల‌నిజం క‌న‌ప‌డ‌దు. ఇక క్లైమాక్స్ సంగ‌తి స‌రేస‌రి… బోర్డర్‌లో గొడ‌వ‌ను ఏదో ఆషామాషీగా చూపించేశాడు. అస‌లు బోర్డర్‌లో లేడీ సైన్యం ఏంటో అర్థం కాదు.

నలభై ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి శరీరం ఇప్పటికీ ఉంటుందా ? అంటే మైనస్ డిగ్రీస్ సెల్షియస్‌లో ఇది సాధ్యమని చెబుతున్నారు. సరే దాన్ని ఆరాయించుకుందాం అనుకునేలోపు ఆ బాడీను హాస్పిటల్‌లో చెకప్‌కు కూడా తీసుకువెళ్ళడం వంటి సన్నివేశాలు అతిగా, నమ్మలేని విధంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫి
మేకింగ్
పూరి మార్క్ డైలాగ్స్ (అనుకున్నంత ఎక్కువ అయితే లేవు)

మైనస్‌ పాయింట్స్‌ :

స్క్రీన్‌ప్లే
లాజిక్‌ లేని సీన్స్‌
క్లైమాక్స్

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : మెహబూబా ‘అర్ధం కాని ప్రేమ కధ'(లాజిక్ లేని)

తెలుగు బులెట్ రేటింగ్ : 2.25 / 5