ఎఫ్ 2 ముద్దుగుమ్మలు వీరేనా?

Mehreen and Tamanna are Heroines in F2 Multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హిరో వరుణ్ తేజ్ ఫిదా, తొలి ప్రేమ సినిమాలాతో హిట్ కొట్టి యూత్ లో మంచి క్రేజ్ ని పొందాడు.ఇప్పుడు ఈ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టి స్టారర్ సినిమా చేస్తున్నాడు. శ్రీరామ నవవి సందర్భంగా నిన్న ఈ సినిమా టైటిల్ f2 ని అనౌన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వరుణ్ సరసన మెహరిన్, వెంకి పక్కన తమన్నా నటించనున్నారు.

మెహరిన్ ప్రస్తుతం గోపీచంద్ ‘పంతం’ సినిమాలో నటిస్తుంది, అంతేకాకుండా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమాలో నటిస్తుంది. ఇక అనిల్ దర్శకత్వం అందిస్తున్న ఎఫ్ 2 ను దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి రానుంది. మిగిలిన సమాచారం త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేయనుంది. వెంకటేష్ ప్రస్త్తుతం తేజా దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా అనంతరం వెంకి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. వరుణ్ ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలను చేయనున్నాడు. వరుణ్ తేజ్ -సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో ఒక సినిమా, సాగర్ చంద్ర దర్శకత్వం లో మరో సినిమా చేయనున్నాడు.