పవన్ కామెంట్స్ చూస్తే ఆపరేషన్ గరుడ నిజమే అంటారు.

Pawan Kalyan wants to do Hunger Strike for AP Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వామపక్షాలతో కలిసి వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవాలని భావిస్తున్న జనసేన అందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రత్యేక హోదా సహా విభజన సమస్యల మీద ఉమ్మడి పోరాటానికి ఓ కార్యాచరణ రూపొందించడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ వామపక్ష నేతలతో విస్తృతంగా చర్చించారు. చర్చల అనంతరం అనంతపురం, విశాఖ, ఒంగోలు లో ఉద్యమ కార్యాచరణకు సంబంధించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఈ విషయాన్ని ప్రకటించడానికి సిపిఎం నేత మధు, సిపిఐ నాయకుడు రామకృష్ణ తో కలిసి ప్రెస్ ముందుకు వచ్చిన పవన్ పాత పాటే పాడారు.

ప్రత్యేక హోదా సహా విభజన హామీలు తుంగలో తొక్కిన కేంద్రాన్ని, ప్రధాని మోడీని ఒక్క మాట కూడా అనకుండా మాట్లాడారు. మొత్తం టార్గెట్ అంతా టీడీపీ మీదే పెట్టారు. నాలుగేళ్లుగా బీజేపీ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ వైఫల్యాల మీద గొంతు చించుకున్న పవన్ అందులో పదోవంతు కూడా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన బీజేపీ లేదా మోడీ మీద గట్టిగా ఒక్క మాట మాట్లాడలేదు. ఓ పక్క ఆపరేషన్ ద్రవిడ లో భాగం అయిన ఆపరేషన్ గరుడ కోసమే పవన్, బీజేపీ కి వంత పాడుతున్నాడని విమర్శలు వస్తున్న తరుణంలో కూడా కమలనాధుల్ని గట్టిగా మాట్లాడేందుకు పవన్ కి నోరు రాలేదు. ఇక వైసీపీ విషయంలో కూడా పవన్ తీరు కూడా అంతే. ఈ వ్యవహారాన్ని చూసి శివాజీ చెబుతున్న ఆపరేషన్ గరుడ నిజమే అనిపిస్తోంది.