Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మొదలు పెట్టగానే ఎన్ని పొగడ్తలు వచ్చాయో అంతకు మించిన విమర్శలు వచ్చాయి. ఇది పైకి కనిపిస్తున్న విషయం. అయితే జగన్ పాదయాత్రకి ముందు దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలి అన్న దానిపై అంతకుమించిన నాటకీయ ఎపిసోడ్ లు ఎన్నో జరిగాయి. నిజానికి ఈ ఖర్చుని ఆయా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు భరించాలని, భరిస్తారని ముందుగా అనుకున్నారు. అయితే ఆ ప్రతిపాదనకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో సీన్ మారిపోయింది. మరీ బలవంతం పెడితే ఒకరిద్దరు నేరుగా నో చెప్పారట. ఇప్పుడు ఈ ఖర్చు రేపు ఎన్నికల ఖర్చు భరించే స్థితిలో లేమని చెప్పేశారట. దీంతో వైసీపీ హైకమాండ్ టెన్షన్ పడింది. జగన్ బాధ చూసి ఈ ఆరునెలల పాదయాత్ర ఖర్చు పెట్టుకోడానికి ఆయన మిత్రుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముందుకు వచ్చారట.
పాదయాత్ర ఖర్చంతా ఒకరి మీదే పడటం జగన్ కి కూడా నచ్చలేదట. అందుకే ఇంకెవరైనా ఉన్నారా అని వెతుకుతుంటే ఒకప్పుడు వైసీపీ కోసం భారీగా ఆర్ధిక సాయం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారికి కనిపించారట. అయితే ఇంతకుముందు ఎన్నికల్లో నెల్లూరు లేదా ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించిన వేమిరెడ్డికి జగన్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన హర్ట్ అయ్యారు. కానీ పార్టీ సానుభూతిపరుడిగానే వున్నారు.
ఒకానొక సమయంలో టీడీపీ లో చేరేందుకు కూడా ఆసక్తి చూపారు. కానీ నెల్లూరు రాజకీయాల్లో వున్న కొన్ని ఇబ్బందుల రీత్యా అది వర్కౌట్ కాలేదు. ఇదే అదనుగా జగన్ నుంచి వేమిరెడ్డికి తాజాగా రాజ్య సభ ఆఫర్ వెళ్లిందట. ఆ ఆఫర్ దక్కాలంటే పాదయాత్ర ఖర్చులో సగం భరించుకోవాలని షరతు పెట్టారట. అయినా రాజకీయాల మీద అమిత ఆసక్తితో వున్న వేమిరెడ్డి అందుకు ఓకే చెప్పి రంగంలోకి దిగారట. దీంతో మొత్తానికి మిథున్ రెడ్డి ఖర్చు లో సగం భరించే వాళ్ళు రెడీ అయ్యారు. జగన్ కూడా హ్యాపీ అయ్యారు.