Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీఆర్ఎస్ నేతల నోటికి తాళం వేయడం ఎవరి వల్లా కాదు. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. ఏది పడితే అది చెప్పి జనాన్ని హోల్ సేల్ గా పిచ్చోళ్లను చేసే విద్యలో వాళ్లు బాగా ఆరితేరారు. కొంపల్లిలో మిషన్ భగీరథ రిజర్వాయర్ ప్రారంభించిన మంత్రి తనదైన శైలిలో రెచ్చిపోయారు. తమ పథకాలకు తానే కితాబులిచ్చేసుకున్నారు.
షరా మామూలుగా గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, అన్నీ తామే చేశామని గొప్పలు చెప్పుకున్నారు. హైదరాబాద్ కు తాగునీళ్లు కూడా మేమే ఇచ్చామంటున్న కేటీఆర్.. గతంలో హైదరాబాదీలు ఏం తాగారో చెప్పాలని సెటైర్లు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ గెలుపు కోసం శృతి మించి హామీలిచ్చి, వాటిన కూడా నెరవేర్చలేదని, పైగా తమదే గొప్ప ప్రభుత్వమని చెప్పుకోవడం కామెడీయే అంటున్నారు జనాలు.
తెలంగాణ సర్కారు విజయాల గురించి డప్పు కొడుతున్న కేటీఆర్.. వైఫల్యాల గురించి కూడా మాట్లాడాలని కోరుతున్నారు జనం. చాలా విషయాల్లో సర్కారు ఫెయిలైంది. మడున్నరేళ్లలో ఐధువేల ఉద్యోగాలిచ్చి… ఏడాదిన్నరలో లక్ష పైగా ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ మాటలు ఎలా చెబుతున్నారో.. ఆయన కొడుకు కేటీఆర్ తీరు కూడా అలాగే ఉంది. ఎంతైనా తండ్రికి తగ్గ కొడుకు కదా.
మరిన్ని వార్తలు: