లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ విజన్ ఉన్న నాయకుడని తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు




