రాజకీయంలో ఎప్పుడు ఎవ్వరు ఎవరికీ శత్రువులు అవుతారో ఎవరికీ మిత్రులు అవుతారో చెప్పడం దుర్లభమనే చెప్పాలి. కానీ రాజకీయం అంటే సినిమా లాంటిదే అనుకుని రేస్ లోకి దిగిన పవన్ కళ్యాణ్ ఇక్కడో పరిస్థితులు చూసి కంగు తింటున్నారు. తనకు మిత్రులు, తనతో ఎంతో స్నేహంగా ఉండేవారు కూడా రాజకీయంగా సహకరించకపోవటం ఆయనకు మింగుడు పడటంలేదు. సినిమాల పరంగా పవన్ కి ఎంతో దగ్గరైన ఆలీ, బండ్ల గణేష్ ఎపిసోడ్స్ ఇప్పటికే మనం చూసాం. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో పవన్ తనకు ఇష్టం అని చెప్పుకునే పొలిటిషన్ కూడా చంద్రబాబే బెటర్ అని చెప్పటంతో పవన్ షాక్ కి గురయ్యారట. అదేంటి? నేను ఇంతలా ప్రజాక్షేమం గురించి మాట్లాడుతుంటే ఇంతలా తిరుగుతుంటే అందరూ ఎవరి దరి వారు చూసుకుంటున్నారు అని లోలోపల అంతర్మథనం చెందుతున్నారట పవన్. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే సమైక్య వాదాన్ని బలంగా వినిపించిన తెలంగాణా నేత జగ్గారెడ్డి. ఒక్క టీఆర్ఎస్ పార్టీ మినహా ఇతర పార్టీల్లో ఉన్న వారిపై తెలంగాణవాదులు దాడి చేస్తున్న రోజుల్లోనే వారి ముందే సమైక్య నినాదాలు చేశారు జగ్గారెడ్డి. అందుకే ఈయనంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. ఈ విషయం పవనే స్వయంగా చెప్పారు కూడా. తెలంగాణా రాష్ట్రము వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో పరాజయం పాలైన ఈయన మొన్నటి సమరంలో టీఆర్ఎస్ తో పోరాడి గెలిచేశారు.
తనపై ప్రజలకు నమ్మకముందని నిరూపించారు. అయితే ఈయన ఏపీ అభివృద్ధి విషయమై స్పందిస్తూ ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పారు. చంద్రబాబు ఓ విజన్ ఉన్న నాయకుడని, ఆయనే మళ్ళీ సీఎం కావాలని, అలాగైతే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. అంతే కాదు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చాలా ఉందని ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు మంచిదని ప్రజలు కోరుకున్న తెలంగాణను కాంగ్రెస్సే ఇచ్చిందని గుర్తుచేశారు జగ్గారెడ్డి. తనను అత్యంత ఇష్టమైన నేతగా పేర్కొన్న పవన్ కల్యాణ్ ఏపీలో జనసేన పార్టీ తరఫున కీలకమైన రాజకీయం చేస్తున్నా పవన్ ని కనీసం గుర్తించకపోవడం పవన్ కి మింగుదు పడడ్లేదట. పవన్ రాజకీయ ప్రతిభ ఏపీ ప్రజలకే కాదు తెలంగాణ నేతలకు కూడా తెలిసిపోయి ఇలా బాబు మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా పవన్ మీద కొంత మంది అయితే నమ్మకం పెట్టుకున్నారు. కనీసం వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న పవన్ రాజకీయంగా విజయం సాదిన్చినట్టే.