Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన నియోజకవర్గం గుంటూరు జిల్లా పెదకూరపాడులో అవినీతికి పాల్పడ్డానని వైసీపీ అధినేత జగన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ విసిరారు. ఇసుక రీచుల్లో అవినీతికి పాల్పడ్డానని జగన్ తనపై చేసిన ఆరోపణలపై అమరావతి అమరలింగేశ్వరస్వామి సన్నిధిలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, జగన్ అక్కడకు రావాలని సవాల్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, జగన్ లా కుట్రపూరిత రాజకీయాలు చేయడం లేదని, జగన్ చూడడానికి చిన్న వ్యక్తిలా కనిపించినా..నిలువెల్లా విషం పాకి ఉందని మండిపడ్డారు. ఇసుక రీచ్ ల్లో అవినీతికి పాల్పడ్డానని జగన్ పాదయాత్రలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అబద్దాన్ని పదే పదే నిజం చేసేలా వ్యవహరించడం జగన్ కు అలవాటనేని శ్రీధర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గుంటూరు జిల్లాలో పాదయాత్రలో భాగంగా జగన్ శ్రీధర్ పై విమర్శలు చేశారు. పెదకూరపాడుకు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అంటే అర్ధం ఏమిటో తెలుసా..? మామూళ్లు, లంచాలు తీసుకునే అబ్బాయి అని అభివర్ణించారు. నియోజకవర్గంలో వేల లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు.