Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
MLA’s MP’s Not Attended Meeting With Ayyanna Pathrudu Meeting
సొంత జిల్లా విశాఖలో గంటాతో ఇంటిపోరు ఎదుర్కుంటున్న అయ్యన్నకు.. ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాలో కూడా గౌరవం దక్కడం లేదు. అయ్యన్న ప్రస్తుతం గుంటూరుకు ఇంఛార్జ్ గా ఉన్నారు. పార్టీ కమిటీలపై మాట్లాడదామని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సమాచారమిస్తే.. ఎవ్వరూ రాకపోవడం అయ్యన్నకు కోపం తెప్పించింది. సీఎం దగ్గర పంచాయితీ పెడతామని ఆగ్రహంగా వెళ్లిపోయారట.
ఇదంతా అయ్యన్న స్వయంకృతమన్న వాదన కూడా ఉంది. ఏపీ వ్యాప్తంగా కలకలం రేపిన విశాఖ ల్యాండ్ స్కామ్ అనే తేనెతుట్టెను అయ్యన్నే కదిపారనేది పార్టీ నేతల అభియోగం. సైలంటుగా విషయం సీఎం చెవిలో వేస్తే పోయేదానికి మీడియాకు ఎక్కి.. పార్టీ పరువు తీశారని వాళ్లు మండిపడుతున్నారు. అలాంటి మంత్రి పిలిస్తే తామెందుకు రావాలని గుంటూరు నేతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కానీ అయ్యన్న ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. గుంటూరుకు ఇక ఇంఛార్జ్ మంత్రిగా ఉండనని చెప్పేసిన అయ్యన్న.. జిల్లా నేతల సంగతి సీఎం దగ్గర తేల్చుకుంటానని అన్నారట. చిత్రమేమిటంటే అయ్యన్న మీటింగ్ కు మండల, జిల్లా, గ్రామ స్థాయి నేతలంతా వచ్చారు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రమే రాలేదంటే.. ముందే కూడబలుక్కున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
మరిన్ని వార్తలు