Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కొత్తగా పెళ్లైంది. దీంతో ఈ నవ వరుడ్ని ఆశీర్వదించేందుకు ఢిల్లీలో ఎంపీలంతా రోజుకో అకేషన్ వెతుక్కుంటున్నారు. ఢిల్లీలో వివాహ రిసెప్షన్ కు కేంద్రమంత్రులు, ఎంపీలు చాలా మంది హాజరయ్యారుని పిలిచినా ఆయన వస్తారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, రాజకీయ వ్యూహాలు చాలా బిజీగా ఉన్నారు.
కానీ అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. మోడీ రామ్మోహన్ నాయుడి రిసెప్షన్ కు హాజరయ్యారు. నవ దంపతుల్ని ఆశీర్వదించారు. మోడీ రామ్మోహన్ నాయుడి రిసెప్షన్ కు రావడంపై చాలా మంది బీజేపీ ఎంపీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ ఫంక్షన్లకు చాలాసార్లు అటెండ్ కాని మోడీ.. ఇప్పుడు రామ్మోహన్ నాయుడి రిసెపన్షన్ కు రావడంపై బీజేపీ ఎంపీలు షాకౌతున్నారు.
ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఎర్రన్నాయుడి అకాల మరణంతో ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి అటు పార్లమెంటులో… ఇటు అధినేత చంద్రబాబు దగ్గరా మంచి మార్కులు కొట్టేశారు. ఏ విషయం మాట్లాడినా సాధికారికంగా మాట్లాడుతూ.. చాలాసార్లు ప్రధాని మోడీ మనసు చూరగొన్నారు. అందుకే మోడీ ఠంచనుగా హాజరయ్యారనేది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
మరిన్ని వార్తలు: