Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇతర పార్టీల నుంచి ఎడాపెడా ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని చేర్చుకుంటున్న మోడీ, అమిత్ షా ద్వయానికి అలాంటి ఓ జంపింగ్ జపాంగ్ షాకిచ్చాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ పటోలే.. ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ ను గతంలో ఓడించాడు. కానీ అలాంటి ప్రుపల్ పటేల్ తోనే బీజేపీ అంట కాగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
గతంలో పార్లమెంటేరియన్ల సదస్సులో.. రైతు సమస్యల్ని ప్రస్తావిస్తే మోడీకి కోపం వచ్చిందట. పైగా ఆయన్ను తన రూమ్ కు పిలిచి మరీ దులిపేశారట. అంతే ఆయన పాలనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు. అంతా బాగుందని పొగడాలి. దీన్ని బట్టి మోడీ, అమిత్ షా కు విలువల్లేవని పటోలే తేల్చిచెప్పేశారు. తనను టార్గెట్ చేసినా.. నిజాలే మాట్లాడతానని పటోలే అంటున్నారు.
కేంద్రమంత్రులు కూడా తీవ్రమైన అభద్రతా భావంలో బతకుతున్నారని, తనకు పదవులపై ఆశ లేదని పటోలే స్టేట్ మెంట్ ఇవ్వడంతో బీజేపీలో కలకలం రేగింది. మోడీ నిరంకుశత్వంపై వ్యతిరేకంగా ఉన్న కొందరు నేతలు కూడా పటోలే భుజంపై తుపాకీ పెట్టి పేల్చాలని అనుకుంటున్నారు. మోడీ మంత్రి పదవులకు ఎంపిక చేస్తున్న నేతలు కూడా మోచేతి నీళ్లు తాగేవాళ్లే కానీ, వెన్నెముక సరిగ్గా ఉన్నవాళ్లు ఎవరూ లేరని సెటైర్లు పడుతున్నాయి.