Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ విషయంలో జగన్ బ్యాచ్ ఓ ఏడెనిమిది నెలలుగా చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ముందుగా మోడీని జగన్ కలిసాడు, ఈ మధ్య విజయసాయి కూడా వెళ్లి ఓ పావు గంట మాట్లాడి వచ్చాడు. దీంతో మోడీని కలవడం సీఎం చంద్రబాబు వల్ల కాలేదంటూ జగన్ అండ్ కో బాగానే ఎకసెక్కాలు చేస్తున్నారు. మాములుగా జగన్ బ్యాచ్ ని తేలిగ్గా కౌంటర్ చేసే టీడీపీ నేతలకు కూడా ఈ టాపిక్ వచ్చేసరికి నోరు లేవడం లేదు. ఇక పచ్చ నేతలకు ఆ కష్టాలు తొలిగిపోయినట్టే. ప్రధాని మోడీ దగ్గర నుంచి సీఎం చంద్రబాబుకి పిలుపు వచ్చింది. ఈ నెల 12 న బాబుకి మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు పీఎంఓ వర్గాలు ధృవీకరించాయి.
గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కి చంద్రబాబు ప్రాధాన్యత ఏమిటో తెలిసొచ్చింది అని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. టీడీపీ ఎంపీ లు కలిసిన మరసటి రోజే పీఎంఓ నుంచి బాబుకి పిలుపు రావడం దాన్ని ధృవీకరిస్తోంది. ఈ నెల 12 న జరిగే భేటీలో పోలవరం సహా విభజన హామీల మీద మోడీతో చంద్రబాబు మాట్లాడతారు. అయితే ఆ చర్చలు కేవలం ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదట. ఇటు ఏపీ, అటు జాతీయ రాజకీయాల గురించి కూడా బాబుతో మోడీ చర్చించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే నిజం అయితే కేసులనుంచి జగన్ ని మోడీ కాపాడతారని ఆశలు పెట్టుకున్న వైసీపీ కి ఇంకోసారి నిరాశ తప్పదు. పీఎంఓ నుంచి వచ్చిన సమాచారంతో జగన్ బ్యాచ్ కి వున్న కొద్దిపాటి సంతోషం కూడా ఆవిరి అయిపోయినట్టే.