Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా దీక్షలు, ధర్నాలు, నిరశనలు చేస్తున్నారు. దీంతో అవి చేసే వ్యక్తులకి పార్టీలకి మైలేజ్ వస్తోంది. మరోపక్క ఈ దీక్షల, నిరశనల ఆధారంగా బీజేపీకి మైలేజ్ తగ్గుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో మేము చేయకపోతే మొత్తం మైలేజ్ పోతుంది అనుకుందో ఏమో కేంద్రంలో ఉన్న బెజేపీ వెంటనే మోడీ చేత దీక్ష చేయిస్తుంది. దేశం మొత్తం మీద చేసే దీక్షలు ఏదయినా సమస్య పరిష్కారం కోసం అయితే తమ రాజకీయ అవసరాల కోసం అసలు పార్లమెంటే జర్గనివ్వని వారు ఇప్పుడు నింద మరొకరి మీద వేసేందుకు ఆయన ఢిల్లీలో దీక్ష చేద్దామని అనుకున్నా చెన్నయిలో జరగనున్న ఓ ప్రారంభోత్సవానికి రావాల్సి ఉండడంతో ఆయన తన పర్యటనలోనే దీక్ష కొనసాగించానున్నారని సమాచారం.
ఏపీకి ప్రత్యేకహోదా, తమిళనాడులో కావేరి జలాల పంపిణీ బోర్డు ఏర్పాటు, తెలంగాణ రిజర్వేషన్ల అంశం వంటి విషయాలపై పార్లమెంటు ప్రారంభమయిన మొదటి రోజు నుంచే అట్టుడుకింది. ఫలితంగా రోజు ఉదయం సభ ప్రారంభం కావడం, విపక్షాల ఆందోళనతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడటం షరా మామూలు అయ్యాయి. ఫలితంగా ప్రజా సమస్యలు ఒక్కటీ చర్చకు రాకుండానే ముగిసిపోయాయి. అందుకే ప్రధాని నరేంద్రమోదీ నిరాహార దీక్ష చేయనున్నారు. పార్లమెంటులో ప్రతిష్టంభనకు విపక్షాలే కారణమని బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని ఆరోపించారు. అందుకే నిరాహార దీక్ష చేపట్టాలని ఆ సమావేశంలోనే నిర్ణయించారు. ఇందులో దేశవ్యాప్తంగా భాజపా ఎంపీలు పాల్గొననున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ప్రధాని ఈరోజు షెడ్యుల్ పేపర్ లీక్ అవ్వడంతో దాన్ని చుసిన నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దానిలో ఏముందంటే 6:40కి ఢిల్లీ లో చెన్నయిలో బయలుదేరే ప్రధానికి ఫ్లైట్ లో ఉండగానే అల్పాహారం ఏర్పాట్లు అని ఉంది. అలాగే మధ్యాహ్నం 02:25 చెన్నయి నుండి ఢిల్లీ కి బయలుదేరిన తరువాత ఫ్లైట్ లోనే మధ్యాహ్న భోజనం అని వ్రాసి ఉంది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ప్రధాని మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిరాహారదీక్ష భూమి మీద ఉంటేనే అంటా… ఆన్ బోర్డు(విమానంలో) తినొచ్చు అంట. నిరాహారదీక్షకి క్రొత్త నిర్వచనం చెప్పిన మోడీ అంటూ రకరకాల జోకులు పేలుస్తున్నారు.